భారత్‌తో టీ20లకు స్టార్ ప్లేయర్ దూరం

Tue,June 19, 2018 06:25 PM

లండన్: సొంతగడ్డపై త్వరలో టీ20 సిరీస్‌ల్లో తలపడనున్న ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార‌త జ‌ట్టు త్వ‌ర‌లో ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. పాకిస్థాన్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తొడ కండరాలకు గాయమైన విషయం తెలిసిందే. తాజాగా బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఆసీస్, భారత్ జట్లతో టీ20 సిరీస్‌ల నుంచి తప్పుకున్నట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మంగళవారం పేర్కొంది. మరోవైపు ఆసీస్, భారత్‌తో టీ20 సిరీస్‌లకు కోసం 14 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు కూడా ఇంగ్లాండ్ వెల్లడించింది.


ఆల్‌రౌండర్లు, అన్నదమ్ములు టామ్ కరన్, శామ్ కరన్ టీ20జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. 1999లో బెన్, ఆడమ్ బ్రదర్స్ తరువాత ఆదేశ జాతీయ జట్టులో అన్నదమ్ములు కలిసి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. జులై 3న భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆరంభంకానుంది. జులై 3-సెప్టెంబర్ 11 మధ్య ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్టులు ఆడనుంది.

England Twenty20 squad (v Australia and India):

EJG Morgan (Captain), MM Ali, JM Bairstow, JT Ball, JC Buttler (wkt), SM Curran, TK Curran, AD Hales, CJ Jordan, LE Plunkett, AU Rashid, JE Root, JJ Roy, DJ Willey

India Team for T20 Series

Virat Kohli (Captain), Shikhar Dhawan, Rohit Sharma, KL Rahul, Suresh Raina, Manish Pandey, MS Dhoni (Wicketkeeper), Dinesh Karthik, Yuzvendra Chahal, Kuldeep Yadav, Washington Sundar, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Hardik Pandya, Siddarth Kaul, Umesh Yadav

3825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles