అంతర్ జిల్లా ఖోఖో చాంప్ రంగారెడ్డి జిల్లా

Thu,November 7, 2019 06:13 AM

హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా ఖోఖో చాంపియన్‌షిప్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్టు 2-0పాయింట్ల తేడాతో నిజామాబాద్‌ జిల్లాపై విజయం సాధించింది. విజేతలకు తెలంగాణ ఖోఖో ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి భాస్కర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఫైనల్ కు చేరుకున్న ఇరు జట్లను అభినందించారు.

227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles