గూగుల్‌లో అత్యధికులు వెతికిన పదం ఇదే.!

Sat,May 26, 2018 03:02 PM

IPL becomes most searched word, reveals study

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన పదంపై తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఆ పదం ఏంటని అనుకుంటున్నారా..? ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. సంక్షిప్త పదం 'ఐపీఎల్'. సెర్చింజన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఈవో), సెర్చ్ అనలటిక్స్ సాఫ్ట్‌వేర్.. సెమ్ ర‌ష్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఇంటెలిజెన్స్ డేటా, వెబ్‌సైట్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, కీ-వర్డ్స్, యాడ్‌వర్డ్స్, మిగతా ఎస్‌ఈవోకు సంబంధించిన డేటాను ఈ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. కీవర్డ్..ఐపీఎల్‌కు 22లక్షల 55వేలకు పైగా రిలేటెడ్ కీ వర్డ్స్ కూడా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఐపీఎల్ కీవర్డ్ వాల్యూమ్ 2017 ఏప్రిల్‌లో 8లక్షల 23వేల ఉండగా.. 2018 ఏప్రిల్‌లో ఆ సంఖ్య రెండింతలు పెరిగి 18లక్షలకు చేరిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తోంది చూడాలి.

7912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles