ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేస్తున్న టాప్ ప్లేయర్స్ వీళ్లే!

Thu,November 15, 2018 01:58 PM

ముంబై: ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న కొందరు టాప్ ప్లేయర్స్‌ను వదిలేస్తున్నాయి. దీనివల్ల వేలంలో ఇతర ప్లేయర్స్‌ను కొనుగోలు చేసేందుకు కాస్త డబ్బులు మిగుల్చుకుంటున్నాయి. ఈ ప్లేయర్స్ లిస్ట్‌లో కేఎల్ రాహుల్, మనీష్ పాండే, జైదేవ్ ఉనద్కట్, బెన్ స్టోక్స్‌లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ వేలంలో భారీ మొత్తాలు చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే వీళ్ల ప్రదర్శన మాత్రం దారుణంగా ఉండటంతో ఫ్రాంచైజీలు వదిలించుకోవాలని చూస్తున్నాయి. కేఎల్ రాహుల్‌ను మినహాయించి మిగతా అందరు ప్లేయర్స్ భారీ మొత్తాలు అందుకున్నా.. గత సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ గత వేలంలో మనీష్ పాండేను 11 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే అతడు సీజన్ మొత్తంలో కేవలం 284 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతన్ని సాగనంపాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే భారీ కొనుగోళ్లతో ఎక్కువగా నష్టపోయింది. గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్‌ను రాయల్స్ కొనుగోలు చేశారు. అయితే అతను దారుణంగా విఫలమయ్యాడు. అటు రూ.11.5 కోట్లు పోసి కొన్ని జైదేవ్ ఉనద్కట్ కూడా రాజస్థాన్ టీమ్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. మొత్తం సీజన్‌లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు.

3318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles