మురళీ విజయ్ 99 నాటౌట్.. ఆటాడుకుంటున్న వర్షం

Thu,June 14, 2018 03:30 PM

బెంగళూరు: అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఇన్నింగ్స్‌లో రెండో శతకం నమోదుకానుంది. ఓపెనర్ మురళీ విజయ్ శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విజయ్(99: 142 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తొలిసెషన్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన శిఖర్ ధావన్ మెరుపు శతకంతో విజృంభించిన విషయం తెలిసిందే. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న విజయ్ అఫ్గాన్ బౌలర్లను ఒత్తిడికి గురిచేస్తూ పరుగులు రాబడుతున్నాడు. వర్షం మైదానం పరిసరాల్లోనే పడుతుందని బెంగళూరులోని ఇతర ప్రాంతాల్లో కురవట్లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. 48.4 ఓవర్లు ఆడిన భారత్ వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్(44) మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.


45.1వ ఓవర్ వద్ద తొలిసారి వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ సమయంలోనే చిరుజల్లులు రావడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. కొద్దిసేపు తరువాత మైదానాన్ని ఆటకు సిద్ధం చేయడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. కనీసం నాలుగు ఓవర్లు కూడా పూర్తికాకముందే వర్షం మళ్లీ వచ్చింది. ఈ సమయంలో విజయ్ 94 పరుగులతో ప్రారంభించి.. కేవలం నాలుగు పరుగులు మాత్రమే జోడించాడు. సెంచరీ సాధించడానికి ఇంకా ఒక్క పరుగు మాత్రమే చేయాల్సి ఉండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ ముగిసేసమయానికి వర్షం తగ్గకపోతే శతకం కోసం రేపటి వరకు వేచిచూడాల్సిందే.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles