ఐపీఎల్ వేలంలో స్టోక్స్‌, మిల్స్ జాక్‌పాట్‌

Mon,February 20, 2017 11:10 AM

బెంగ‌ళూరు: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వేలంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ బెన్ స్టోక్స్‌, టైమ‌ల్ మిల్స్ జాక్‌పాట్ కొట్టారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఫ్రాంచైజీలు ఈ ఇద్ద‌రి కోసం తీవ్రంగా పోటీ ప‌డ్డారు. ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కోసం హోరాహోరీ సాగుతుంద‌ని ముందే ఊహించినా.. మిల్స్‌ను రూ.12 కోట్ల‌కు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కొనుగోలు చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించింది. స్టోక్స్ అయితే ఐపీఎల్ చ‌రిత్ర‌లో యువ‌రాజ్ (రూ.16 కోట్లు) త‌ర్వాత అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించ‌డం విశేషం. అత‌న్ని పుణె సూప‌ర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. చివ‌రి వ‌ర‌కు స్టోక్స్ కోసం ముంబై, ఢిల్లీ, స‌న్‌రైజ‌ర్స్‌, పుణె తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి పుణె అత‌న్ని రూ.14.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

ఇక కేవ‌లం 4 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టైమ‌ల్ మిల్స్ కోసం కూడా ఫ్రాంచైజీలు విప‌రీతంగా పోటీ ప‌డ‌టం విశేషం. అత‌ని కోసం ముంబై, పంజాబ్ మ‌ధ్య హోరాహోరీ సాగింది. చివ‌ర్లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కూడా పోటీ ప‌డింది. అయితే ప‌ది కోట్ల బిడ్ దాటిన త‌ర్వాత ఎంట‌రైన బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ మిల్స్‌ను రూ.12 కోట్లు కొనుగోలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడ‌ని మిల్స్ కోసం బెంగ‌ళూరు ఇంత ఖ‌ర్చు పెట్టడం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇక న్యూజిలాండ్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్‌, సౌతాఫ్రికా బౌల‌ర్ కాగిసో ర‌బాడాలు రూ.5 కోట్లు ప‌ల‌క‌గా.. ఆస్ట్రేలియా బౌల‌ర్ ప్యాట్ క‌మిన్స్ రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయాడు. క‌మిన్స్‌, ర‌బాడాల‌ను ఢిల్లీ.. బౌల్ట్‌ను కోల్‌క‌తా కొనుగోలు చేశాయి.

2251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles