'బెంగాల్ టైగర్' చొక్కా విప్పింది నేడే..: వీడియో

Fri,July 13, 2018 04:09 PM

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు ప్రతీ భారత క్రికెట్ అభిమాని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే గొప్ప మ్యాచ్ నాట్‌వెస్ట్ ఫైనల్ మ్యాచ్(జులై 13, 2002). జులై 13 అనగానే ముందుగా మదిలో మెదిలే అపురూప ఘట్టం భారత మాజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీ చొక్కా విప్ప చేసిన హంగామానే. ఆ చిరస్మరణీయ విజయానికి నేటితో 16ఏళ్లు పూర్తయ్యాయి. దీనికి తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.


లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెట్ సిరీస్‌లో భారత్ ఘనవిజయాన్ని సాధించిన తరువాత.. బాల్కనీలో చొక్కా విప్పి చేసిన సంబరాలు ఇప్పటికీ ఓ సంచలనమే. తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన గొప్ప ఆటగాడు సౌరభ్. ప్రత్యర్థి స్టేడియంలో చొక్కా విప్పి భారత్ విజయాన్ని సగర్వంగా ఆస్వాదించడం అది బెంగాల్ టైగర్‌కే చెల్లింది.

అప్పటి యువ ఆటగాళ్లు యువరాజ్‌సింగ్, మహ్మద్ కైఫ్ ఆఖరి వరకు పోరాడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించారు. ఆ వెంటనే ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానం బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పి హల్‌చల్ చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా ఏంటో నిరూపించాడు.1921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles