కాంపౌండర్ కొడుకు ఐపీఎల్ అరంగేట్రం

Fri,May 25, 2018 07:20 PM

Khaleel Ahmed being congratulated in the SRH camp

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్.. కోల్‌కతాతో మ్యాచ్‌కు మూడు మార్పులు చేసింది. మిడిలార్డర్‌లో రాణిస్తాడని వేలంలో మనీశ్ పాండే కోసం రూ.11కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. 15 మ్యాచ్‌ల్లో 284 పరుగులే చేసిన పాండే ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌కు అవసరమైన సమయంలో సత్తాచాటిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో అతనితో పాటు శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మను జట్టు నుంచి తప్పించారు. వారి స్థానంలో దీపక్ హుడా, వృద్ధిమాన్ సాహా, ఖలీల్ అహ్మద్‌లను విలియమ్సన్ జట్టులోకి తీసుకున్నాడు.

ఐపీఎల్ వేలంలో ఖలీల్‌ను సన్‌రైజర్స్ రూ.3కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడే అతడి గురించి సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చసాగిన విషయం తెలిసిందే. దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించిన అతడిపై వేలంలో పోటీ పెరిగింది. లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అహ్మద్‌కు అవకాశం రాలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైన నేపథ్యంలో సన్‌రైజర్స్ అతనికి తుది జట్టులో చోటు కల్పించింది. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌ఫున అరంగేట్రం చేయ‌బోతున్న నేప‌థ్యంలో స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ఖ‌లీల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఖలీల్ తండ్రి కాంపౌండర్ అన్న విషయం తెలిసిందే. వేలంలో అత్యధిక ధర పలికిన సమయంలో ఖలీల్ మాట్లాడుతూ... తన తల్లిదండ్రులకు ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పాడు.

10442
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles