చెన్నైపై గెలిచిన పంజాబ్

Sun,May 5, 2019 07:46 PM

Kings XI Punjab won by 6 wickets against chennai

చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. తర్వాత బరిలో దిగిన పంజాబ్.. 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 71 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. క్రిస్‌గేల్ 28 పరుగులు చేసి రాహుల్‌కు మంచి జోడినందించాడు. 71 పరుగులు చేసిన రాహుల్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌(96: 55 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు), సురేశ్‌ రైనా(53: 38 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగారు. మెరుపు ఆరంభం ల‌భించినా.. ఆఖర్లో వరుసగా వికెట్లు చేజార్చుకున్న చెన్నై 5 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. ఐదో ఓవర్‌లోనే షేన్‌వాట్సన్‌ వెనుదిరగడంతో రైనాతో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. జట్టును పటిష్ఠస్థితిలో నిలిపి బౌలర్లపై విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆఖరి ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. చెన్నై సారథి ధోనీ 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ(2/17), శామ్‌ కర్రన్‌(3/35) అద్భుతంగా రాణించారు.
3677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles