క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా

Fri,May 25, 2018 06:43 PM

Kolkata Knight Riders have won the toss and have opted to field

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్-11లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-2లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైన సన్‌రైజర్స్.. వరుసగా నాలుగు విజయాలు సాధించిన నైట్‌రైడర్స్ తుదిపోరు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.

టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సీర్లెస్ స్థానంలో శివమ్ మావీ తుది జట్టులోకి తీసుకున్నట్లు కార్తీక్ వెల్లడించాడు. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. మనీశ్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మ స్థానంలో దీపక్ హుడా, వృద్ధిమాన్ సాహా, ఖలీల్ అహ్మద్ జట్టులోకి ఎంపిక చేసినట్లు హైదరాబాద్ సారథి విలియమ్సన్ వివరించాడు.









1953
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles