కుల్దీప్‌కు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

Mon,February 11, 2019 03:05 PM

Kuldeep Yadav achieves career-best 2nd rank in T20Is

దుబాయ్: భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అతడు రెండో ర్యాంకుకు ఎగబాకాడు. టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. పొట్టి క్రికెట్లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడంతో కివీస్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి టీ20లో కుల్దీప్ 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సిరీస్‌లో ఆడిన ఏకైక మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, మున్రోను 24ఏండ్ల మణికట్టు స్పిన్నర్ పెవిలియన్ పంపాడు.

కుల్దీప్ కన్నా ముందు అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. టాప్-10లో భారత్‌కు చెందిన ఏ ఒక్క బౌలర్‌కు చోటు దక్కలేదు. మరో భారత యువ స్పిన్నర్ చాహల్ ఆరు స్థానాలు పడిపోయి.. 17వ ర్యాంకులో నిలిచాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 18వ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు.. కేఎల్ రాహుల్ పదిలో నిలిచారు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రాహుల్ ఆడని విషయం తెలిసిందే.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles