సన్‌రైజర్స్‌కు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

Fri,May 25, 2018 07:58 PM

kuldeep yadav two wickets in his first over

కోల్‌కతా: క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా క్రమశిక్షణతో బంతులేయడంతో స్కోరు బోర్డు నిదానంగా కదులుతోంది. స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్ హైదరాబాద్‌కు షాకిచ్చాడు.

8వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్(34: 24 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్)ను ఎల్బీగా పెవిలియన్ పంపిన కుల్దీప్.. అదే ఓవర్ ఐదో బంతికి సూపర్ ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్(3)ను ఔట్ చేసి భారీ దెబ్బకొట్టాడు. దీంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ 69 పరుగులు చేసింది. సాహా(26), షకిబ్ అల్ హసన్(4) క్రీజులో ఉన్నారు.

3380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles