క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌

Mon,August 19, 2019 11:11 AM

Labuschagne becomes first concussion substitute in Test history

క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్నస్ లబ్‌షేన్ రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడ్డ ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్థానంలో అతడు ఈ మ్యాచ్‌లో ఆడాడు. స్మిత్ గాయపడ్డ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనల మేరకు ఆసీస్ సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా.. అందుకు అంగీకారం లభించింది. సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ మాత్రమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఆర్చర్‌ బౌన్సర్‌కు క్రీజులోనే కుప్పకూలిన స్మిత్‌ చివరి రోజు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆదివారం ఉదయం అతడు తీవ్ర తలనొప్పితో బాధపడుతుండటంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో లబుషేన్‌ను ఎంపిక చేశారు. మరోవైపు ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఆర్చర్‌ వేసిన బంతి లబుషేన్‌ హెల్మెట్‌ గ్రిల్‌కు తాకడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఉత్కంఠ రేపిన యాషెస్‌ రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

3536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles