అశ్విన్‌కు ఊరట.. ఆ రనౌట్‌ను సమర్థించిన ఎంసీసీ

Wed,March 27, 2019 12:26 PM

Mankading has to be there says MCC on Ashwins controversy

లండన్: రెండు రోజులుగా ఐపీఎల్‌తోపాటు క్రికెట్ ప్రపంచంలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ .. మన్కడింగ్ చేయడాన్ని కొందరు తప్పుబడుతుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. అశ్విన్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమన్న వాదన వినిపిస్తున్నా.. రనౌట్ మాత్రం నిబంధనలకు లోబడే చేశాడన్న సమర్థనా ఉంది. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. అసలు క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మాత్రం మన్కడింగ్‌ను సమర్థించింది. ఈ నిబంధన కచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేకపోతే నాన్ ైస్ట్రెకర్స్ తమ ఇష్టం వచ్చినట్లు క్రీజు వదిలి ముందుకు పోయే స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఈ నిబంధన తప్పనిసరి అని ఎంసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయంలో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అశ్విన్ రనౌట్ చేశాడు.

ఇది మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నిజానికి ఇందులో అశ్విన్ చేసిన తప్పేమీ లేదు. ఎంసీసీ కూడా ఇప్పుడిదే చెప్పింది. రనౌట్ చేసే ముందు బ్యాట్స్‌మన్‌కు వార్నింగ్ ఇవ్వాలని నిబంధన లేదు. పైగా ఇదేమీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమూ కాదు. ఇక అశ్విన్ బంతి వేయడానికి సిద్ధంగా ఉన్నపుడు బట్లర్ క్రీజును వదిలాడా లేదా అన్నదానిపై అతన్ని ఔట్ ఇవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించవచ్చు. బట్లర్ క్రీజు వదిలి వెళ్లేలా ప్రోత్సహించడానికి అశ్విన్ కావాలనే బంతి వేయడాన్ని ఆలస్యం చేశాడని కొందరంటున్నారు. ఇది నిజమే అయితే మాత్రం అది కచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. కానీ అశ్విన్ మాత్రం తానలా చేయలేదని చెబుతున్నాడు. క్రికెట్‌ను నిబంధనలకు లోబడి, క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా ఆడాల్సిన అవసరం రెండు జట్లకూ ఉంది అని ఎంసీసీ తన ప్రకటనలో తేల్చి చెప్పింది.

1819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles