మళ్లీ అడ్డగించిన వరుణుడు.. 35 ఓవర్లకు ఆగిపోయిన మ్యాచ్

Sun,June 16, 2019 11:00 PM

match again stopped due to rain in manchester

ఈ ప్రపంచ కప్‌ను వరుణుడు వదిలేలా లేడు. ఇప్పటికే వర్షం కారణంగా నాలుగు మ్యాచులు రద్దయ్యాయి. ఇవాళ జరుగుతున్న దాయాదుల పోరులోనూ వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తొలుత ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వరుణుడు అడ్డుకున్నాడు. తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ఇండియా తన బ్యాటింగ్‌ను ముగించేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇక.. పాకిస్థాన్ బ్యాటింగ్‌లోనూ వరుణుడు విజృంభిస్తాడా? అని అంతా భయపడ్డారు. 35 ఓవర్ల వరకు కాస్త కుదుటపడ్డ వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. మళ్లీ మాంచెస్టర్‌లో వర్షం పడుతోంది. 35 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 166 పరుగులు చేసింది. దీంతో 35వ ఓవర్ వద్ద మ్యాచ్ ఆగిపోయింది. అయితే.. పాకిస్థాన్ మ్యాచ్ ఆడినా గెలిచేది లేదు. ఇంకో 15 ఓవర్లలో 171 పరుగులు చేయాలి. అది సాధ్యమయ్యే పని మాత్రం కాదు. కాకపోతే వర్షం తగ్గేంతవరకు చూసి పాకిస్థాన్ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

4309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles