రూ.200 వాచ్ కోసం క్రికెటర్ బేరం.. వీడియో

Thu,April 4, 2019 04:44 PM

Matthew Hayden seen bargaining for a Watch on a footpath in Chennai

చెన్నై: పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఇతడో స్టార్ క్రికెటర్. తన కెరీర్‌లో కోట్లు సంపాదించాడు. కానీ చెన్నై వీధుల్లో తిరుగుతూ ఫుట్‌పాత్‌పై అమ్మే ఓ వాచ్ కోసం బేరమాడుతూ కనిపించాడు. చివరికి రూ.200 విలువ చేసే వాచ్‌ను రూ.180కి కొన్నాడు. ఇంతకీ ఈ క్రికెటర్ ఎవరు? అతనెందుకు ఫుట్‌పాత్‌పై వస్తువులు కొన్నాడో చూద్దాం.. ఇతని పేరు మాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియా తరఫున సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో హేడెన్ కూడా ఒకడు. ఐపీఎల్‌లో భాగంగా తొలి మూడేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం కామెంట్రీ ఇవ్వడానికి మరోసారి ఇండియా వచ్చాడు. ఈ సందర్భంగా తనను ఎవరూ గుర్తు పట్టకుండా లుంగీ కట్టుకొని, ఓ నకిలీ గడ్డం, మీసం తగిలించుకొని.. చెన్నైలోని టీనగర్ స్ట్రీట్ మాల్‌లో షాపింగ్ చేశాడు. ఇంతకీ అతను ఈ సీక్రెట్ షాపింగ్ ఎందుకు చేశాడో తెలుసా? లెజెండరీ ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ .. హేడెన్‌కు ఓ సవాలు విసిరాడు. చెన్నైలో రూ.1000లోపు ఉన్న వస్తువులు కొనాలన్నది ఆ చాలెంజ్. దీంతో హేడెన్ వెంటనే టీ నగర్‌కు వెళ్లిపోయాడు. అక్కడ వెయ్యిలోపు విలువున్న లుంగీలు, షర్ట్‌లు, వాచ్‌లు కొన్నాడు. స్థానికంగా ఉండే ఓ యువకుడు అతనికి షాపింగ్ చేయడంలో సాయం చేశాడు. ఓ వాచ్ కోసం హేడెన్ బేరమాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

4045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles