ఇండోర్: స్థానిక హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఆధిక్యం వైపు అడుగులేస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాని 150 పరుగులకి ఆలౌట్ చేసిన భారత్ ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ 66( 11 ఫోర్స్), అజింక్యా రహానే 22( 4 ఫోర్స్) ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం 86 పరుగులతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 105 పరుగులు వద్ద రెండో వికెట్ పుజారా 54 ( 9 ఫోర్స్) రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సున్న పరుగుల వద్ద వెనుదిరిగాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్స్ బంగ్లా బౌలర్ అబు జయేద్కి దక్కడం విశేషం.