పాకిస్తాన్ కోచ్‌గా మిస్బా-ఉల్-హక్

Wed,September 4, 2019 06:45 PM

ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గా పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను నియమిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. మిస్బా.. కోచ్ సహా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తారని ఈ సందర్భంగా పీసీబీ పేర్కొన్నది. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌ను నియమించారు. వీరు మూడు సంవత్సరాలకు గానూ ఈ భాద్యతలు నిర్వహిస్తారు. దేశావాలీ క్రికెట్ జట్ల కోచ్‌లకు కూడా మిస్బా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు.
పీసీబీ సభ్యులొకరు మాట్లాడుతూ.. మాకు మిస్బా కన్నా ప్రత్యామ్నయం ఏమి కనిపించలేదన్నారు. జట్టును గాడిలో పెట్టడానికి అతనికంటే ఉత్తములు లేరన్నారు.


మిస్బా మాట్లాడుతూ.. తనను కోచ్‌గా నియమించడం చాలా ఆనందంగా ఉందనీ, అదే సమయంలోనూ పెద్ద భాద్యత కూడా ఉందన్నారు. నాపైన పెట్టుకున్న అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తాననీ, జట్టును విజయపథంలో నడిపిస్తానన్నారు. శ్రీలంకతో త్వరలో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ-20 సిరీస్ నుంచి వీరు అందుబాటులోకి రానున్నారు. తదుపరి, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. నవంబర్ 21 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

కాగా, మిస్బా, వకార్ యూనిస్ 2014 నుంచి 2016 వరకు కలిసి పని చేశారు. అప్పుడు మిస్బా కెప్టెన్ కాగా, వకార్ కోచ్‌గా ఉన్నారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles