టీ-20లకు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

Tue,September 3, 2019 02:59 PM

హైదరాబాద్: ఇండియా మాజీ టీ-20 కెప్టెన్ మిథాలీరాజ్ టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన మిథాలీ.. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగనుంది. కాగా, ఇప్పటి వరకు మిథాలీరాజ్ ఇండియా తరఫున 32 టీ-20మ్యాచ్‌లడారు. అందులో మూడు ప్రపంచకప్‌లకు ఆడడం విశేషం.
2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు. ఈ టోర్నీలో ఆమె పాకిస్థాన్‌పై 47 బంతుల్లో 56 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే టోర్నీలో ఐర్లాండ్‌పై 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.


865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles