నాకు తెలుసు, ఏదో ఒకరోజు నేను టీమిండియాకు ఆడుతా

Tue,May 29, 2018 04:44 PM

MS Dhoni Gave Me Some Valuable Tips During IPL Ishan Kishan

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మంచి ప్రదర్శనే చేశాడు. స్టార్ ఆటగాళ్లకు దీటుగా తనదైన శైలిలో కొన్ని మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ రెండు అర్ధశతకాలు సాధించి 275 పరుగులు చేశాడు. భవిష్యత్‌లో టీమిండియాలో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

నాకు తెలుసు, నేను ఏదో ఒకరోజు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని. ఆ విషయంలో నేను 100శాతం స్పష్టతతో ఉన్నా. ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండాలి. మీ స్థానంలో మీరు బ్యాటింగ్ చేయలేనని తరువాత చెప్పలేరు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై మహేంద్రసింగ్ ధోనీ భాయ్‌తో మాట్లాడాను. మానసికంగా ధైర్యంగా ఉండాలని, ఒక మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన తరువాత రిలాక్స్ కాకూడదని, అదే తీవ్రతను తరువాత కూడా కొనసాగించాలని మహీ సూచించినట్లు ఇషాన్ పేర్కొన్నాడు. ఇషాన్ కూడా ధోనీ సొంత రాష్ట్రమైన ఝార్ఖండ్ కావడం విశేషం.

5367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles