కాశ్మీర్‌లో ధోనీ క్రికెట్ అకాడమీ..?

Mon,August 12, 2019 04:33 PM

ms dhoni might start cricket academy in kashmir

శ్రీనగర్: భారత జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న విషయం విదితమే. దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న 106 టీఏ బెటాలియన్ (పారా)లో ధోనీ తోటి సైనికులతో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ధోనీ ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తాడని తెలిసింది. ఈ అకాడమీ ద్వారా ధోనీ కాశ్మీర్ యువకులకు క్రికెట్‌లో ఉచితంగా శిక్షణనివ్వాలని చూస్తున్నాడట. అందుకు అనుగుణంగానే ధోనీ త్వరలోనే క్రీడా మంత్రిత్వ శాఖతో మాట్లాడుతాడని కూడా తెలిసింది. కాగా ఆగస్టు 15న ధోనీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లడఖ్‌లోని లెహ్‌లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాడని సమాచారం. కానీ ఇంకా ఆ కార్యక్రమ వేదిక వివరాలను ఆర్మీ అధికారికంగా వెల్లడించలేదు.

1628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles