ధోనీ డ్యాన్స్ .. వీడియో

Mon,April 10, 2017 10:36 AM

ముంబై: అత‌ను నిజంగా మిస్ట‌ర్ కూలే.. కెప్టెన్సీ పోయింద‌న్న బాధ లేదు. టీమ్ ఓన‌ర్ త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌న్న చింత లేదు. పైగా పెద్ద భారం తొలగిపోయింద‌న్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు ధోనీ. ఐపీఎల్ మ్యాచ్ త‌ర్వాత పుణె టీమ్ జెర్సీలోనే డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. టీమ్ స‌భ్యుల‌తో క‌లిసి అత‌ను స్టెప్పులేశాడు. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సీజ‌న్‌లో పుణె టీమ్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్‌.. ధోనీ డ్యాన్స్‌ను ఆస‌క్తిగా గ‌మ‌నించ‌డం ఇందులో క‌నిపిస్తుంది. ఈ వీడియోను ఇప్ప‌టికే ఆరు ల‌క్ష‌ల‌కుపైగా చూడ‌గా.. 4 వేల మంది కామెంట్ చేశారు.

A post shared by @mahi7781 onఈ సీజ‌న్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పుణె.. ఒక‌టి గెలిచి, మ‌రొక‌టి ఓడిన విష‌యం తెలిసిందే. అయితే టీమ్ ప‌ర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ‌గా టీమ్ ఓన‌ర్ సంజీవ్ గోయెంకా త‌మ్ముడు హ‌ర్ష్ గోయెంకా ధోనీని త‌క్కువ చేసి వ‌రుస‌గా ట్వీట్లు వేయడం ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచింది. తొలి మ్యాచ్ గెల‌వ‌గానే స్మిత్‌ను పొగుడుతూ.. ధోనీ త‌క్కువ చేసి చూపాడు హ‌ర్ష్ గోయెంకా. దీనిపై అభిమానుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో త‌న ట్వీట్ల‌న్నింటినీ ఆయ‌న తొలగించారు. అయితే ఇవేమీ ప‌ట్టించుకోని ధోనీ మాత్రం ఎప్ప‌టిలాగే కూల్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు.

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles