ధోనీ గ్లౌజ్‌లు చూశారా ? ఆ గుర్తు ఏంటో తెలుసా !

Thu,June 6, 2019 10:39 AM

MS Dhoni Sports Gloves With Army Balidan badge

హైద‌రాబాద్: సౌంతాప్ట‌న్ వ‌న్డేలో.. ధోనీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను ధ‌రించిన గ్లౌజ్‌లు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. త‌న‌లో ఉన్న దేశ‌భ‌క్తిని మ‌రోసారి చాటాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ.. ముదురు ఆకుప‌చ్చ‌ క‌ల‌ర్‌లో ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించాడు. అయితే ఆ కీపింగ్ గ్లౌజ్‌ల‌పై ఓ చిహ్నం ఉంది. అది పారామిలిట‌రీ ద‌ళాల‌కు చెందిన గుర్తు. దాన్ని బ‌లిదాన్ బ్యాడ్జిగా పిలుస్తారు. 2011లో ధోనీకి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ర్యాంక్ ఇచ్చారు. ఆగ్రాలో అత‌ను ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. శిక్ష‌ణ స‌మ‌యంలో అయిదు ప్యారాచూట్ జంప్‌లు కూడా చేశాడు. బ‌లిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించిన ధోనీకి.. ట్విట్ట‌ర్‌లో అభిమాన‌లు సెల్యూట్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో వ‌న్డేలో ధోనీ 34 ర‌న్స్ చేశాడు. కోహ్లీసేన త‌న త‌రువాత మ్యాచ్‌ను జూన్ 9వ తేదీన ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న‌ది.







4160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles