కొత్త జెర్సీలో కోహ్లీసేన‌.. వీడియో

Sat,June 29, 2019 10:19 AM

MS Dhoni, Virat Kohlis first look in Indias new Jersey

హైద‌రాబాద్: టీమిండియా ప్లేయ‌ర్లు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ జెర్సీ వేసుకున్న కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్విట్ట‌ర్‌లో ఆ ప్లేయ‌ర్ల ఫోటోల‌ను పోస్టు చేశారు. ఆరెంజ్ జెర్సీలో టీమిండియా ప్లేయ‌ర్లు డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. బీసీసీఐ శుక్ర‌వారం అధికారికంగా ఈ డ్రెస్సును రిలీజ్ చేసింది.అందరూ అనుకున్నట్లుగానే నారింజ, నీలి రంగు కాంబినేషన్‌లో కొత్త డ్రెస్ అదిరిపోయేలా కనిపిస్తున్నది. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ అత్యుత్తమ శ్రేణిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా డ్రెస్‌ను డిజైన్ చేశారు. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని మలిచారు.
View this post on Instagram

📸📸 How many likes for this jersey ? #TeamIndia

A post shared by Team India (@indiancricketteam) on


ఫిఫా టోర్నీల తరహాలో గతానికి భిన్నంగా ఐసీసీ ఈసారి రెండు జెర్సీల ఫార్మాట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు వేర్వేరు రంగుల్లో జెర్సీలను(హోమ్ అండ్ అవే) ఎంచుకోవాల్సి ఉంటుంది. జెర్సీలు దాదాపు ఒకే రంగులో ఉండటం వలన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త అవతారంలో బరిలోకి దిగుతున్నది. మరి ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమ్‌ఇండియా అదిరేటి ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది. చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి ఫొటోలను సోషల్‌మీడియాలో అభిమానుల కోసం షేర్ చేశారు.

3877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles