లేట్‌గా వచ్చావో.. కోహ్లికి ధోనీ వార్నింగ్.. వీడియో

Fri,March 15, 2019 02:59 PM

MS Dhonis soft warning to Virat Kohli in this latest IPL promo going viral

చెన్నై: టీమిండియాలో ధోనీ హాఫ్ కెప్టెన్. అతడు తుది జట్టులో లేకపోతే కోహ్లికి ఏమీ తోచడం లేదు. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లో కోహ్లి పరిస్థితి ఎలా ఉందో మనం చూశాం. అయితే ఇప్పుడీ ఇద్దరూ తమ తమ టీమ్స్‌కు కెప్టెన్లుగా ఐపీఎల్‌లో తలపడబోతున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందే హీటు పుట్టించే టీజర్లను ఐపీఎల్ రిలీజ్ చేస్తోంది. రెండు జట్ల అభిమానులూ.. ధోనీ, కోహ్లి అనుకుంటూ పోటీలు పడి నినాదాలు చేస్తున్న వీడియోను తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ చివర్లో ధోనీ, కోహ్లి కూడా చాయ్ తాగుతూ.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ సవాలు విసురుకుంటారు. సరే అంటూ వెళ్లిపోతున్న ధోనీ.. లేట్‌గా రాకు అంటూ కోహ్లికి ఓ సాఫ్ట్ వార్నింగ్ ఇవ్వడం వీడియోకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


2450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles