మ్యూజిక్‌, యోగా.. ఇదీ కుంబ్లే మార్క్ ప్రాక్టీస్‌

Mon,July 4, 2016 11:45 AM

బెంగ‌ళూరు: టీమిండియా కొత్త కోచ్ అనిల్ కుంబ్లే త‌న స్టైల్లో టీమిండియా ప్లేయ‌ర్స్‌ను ఒక్క‌టి చేస్తున్నాడు. టీమ్ బిల్డింగ్‌లో భాగంగా డ్ర‌మ్‌జామ్‌, బ‌డ్డీ ప్రాజెక్ట్‌, యోగా పేరుతో కొత్త కొత్త ప్రాజెక్ట్‌ల‌ను ప్లేయ‌ర్స్‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. విండీస్ టూర్ కోసం సిద్ధ‌మ‌వుతున్న ప్లేయ‌ర్స్ ఈ కొత్త స్టైల్ కోచింగ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. టెస్టు, వ‌న్డే కెప్టెన్లు కోహ్లి, ధోనీల‌తోపాటు సీనియ‌ర్‌, జూనియ‌ర్ టీమ్స్ ప్లేయ‌ర్సంతా ఈ స్పెష‌ల్ సెష‌న్‌కు హాజ‌ర‌య్యారు. ఇండియన్ క్రికెట్ హిస్ట‌రీలో తొలిసారి ఇలా బాండింగ్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఏర్పాటుచేశారు.
డ్ర‌మ్‌జామ్ కోసం యాక్ట‌ర్‌, మ్యుజీషియ‌న్ వ‌సుంధ‌ర దాస్‌ను ప్ర‌త్యేకంగా పిలిపించింది బీసీసీఐ. డ్ర‌మ్ స‌ర్కిల్ అనే పేరుతో ప్లేయ‌ర్సంతా స‌ర్కిల్‌లో కూర్చొని డ్ర‌మ్స్ వాయించారు. గ్రూప్ క‌మ్యూనికేష‌న్‌, ఒత్తిడిని అధిగ‌మించ‌డానికి, సృజ‌నాత్మ‌క‌త‌ను పెంచేందుకు, ఉత్సాహం నింప‌డానికి ఈ డ్ర‌మ్ సర్కిల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక బ‌డ్డీ ప్రాజెక్ట్ పేరుతో సీనియ‌ర్ ఆట‌గాళ్లు త‌మ అంత‌ర్జాతీయ అనుభ‌వాన్ని జూనియ‌ర్ ప్లేయ‌ర్స్‌కు వివ‌రించే ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి కూడా కుంబ్లే శ్రీకారం చుట్టాడు. అలాగే ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా యోగా సెష‌న్ కూడా నిర్వ‌హించారు.

1533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles