లియాన్ తప్పిదం మ్యాచ్‌నే దూరం చేసింది...వీడియో

Mon,August 26, 2019 03:44 PM

లీడ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా వెడింగ్లే మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో ఆసీస్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆసీస్ ఆటగాళ్ల తప్పిదం వల్లే ఓడిందనేది నిర్వివాదాంశం. ఇంగ్లాండ్ విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో లియాన్ బౌలింగ్‌లో స్టోక్స్ రివర్స్ స్వీప్ ఆడగా బంతి ఫీల్డర్‌కు సమీపంలోనే పడడంతో బెన్ రన్ తీయడానికి నిరాకరించాడు. అయితే నాన్ ైస్ట్రెక్ ఎండ్‌లో ఉన్న జాక్ లీచ్ పరుగుకు ప్రయత్నించాడు. స్టోక్స్ వారించడంతో వెనక్కి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో ఆసీస్ ఫీల్డర్ విసిరిన డైరెక్ట్ త్రోను బౌలర్ లియాన్ జారవిడవడంతో లీచ్ బతికిపోయాడు. కానీ లియాన్ అతడ్ని ఔట్ చేసి ఉంటే ఆసీస్ మ్యాచ్ గెలిచేది. వెంటనే వేసిన మరో బాల్ స్టోక్స్ ప్యాడ్లను తాకగా ఎంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రీప్లేలో అది ఔట్‌గా తేలింది. కానీ, అప్పటికే ఆసీస్ రివ్యూలు కోల్పోయింది.
కాగా, ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్ గెలిచి ఐదు మ్యాచుల సిరీస్‌ను 1-1గా నిలిచింది. స్టోక్స్ అజేయ శతకంతో(135) నాటౌట్‌గా నిలిచి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.1982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles