ధోనీ సతీమణి సాక్షి పోస్ట్‌పై నెటిజ‌న్లు ఫైర్‌

Wed,April 24, 2019 12:19 PM

netizens fires sakshi singh instagram post kissing monu kumar

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసిన ఫొటో.. పోస్ట్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ట్వీట్‌లో ఏముందంటే.. బంజరు భూమి.. పచ్చదనం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. గడ్డి ఈ వైపు ఇంకా పచ్చగా లేదు .. అంటూ మోనూ కుమార్ అనే క్రికెటర్ తలపై సాక్షి సింగ్ ముద్దుపెట్టింది. అతని బట్టతలపై సెటైర్ వేస్తూ బీ-పాజిటివ్ ఆల్‌వేస్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఈ ట్వీట్ చేశారు. మోనూ కుమార్ చెన్నై టీమ్‌లో కొనసాగుతున్నాడు. మీరు ఇలాంటి పోస్ట్ పెట్టడం తమను ఎంతగానే బాధించిందని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. పాజిటివ్‌గా ఆలోచించండి అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వరుస ట్వీట్లతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.

8709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles