లైన్ క్లియర్..పాక్ షూటర్లు భారత్ రావొచ్చు!

Mon,February 18, 2019 04:07 PM

No Visa Denial For Pakistan Shooters Coming To India For World Cup

న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఆదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 200శాతానికి పెంచారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ను అష్టదిగ్భందనం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను భారత్ ఉపయోగించుకుంటోంది. ఐతే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20-28 మధ్య న్యూఢిల్లీ వేదికగా షూటింగ్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కఠిన పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు వీసా ఇచ్చేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.

వరల్డ్‌కప్‌లో పాక్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) సెక్రటరీ రాజీవ్ భాటియా సోమవారం అధికారికంగా వెల్లడించారు. హోంమంత్రిత్వశాఖ తమ ఆమోదాన్ని తెలిపిందని, ఇక వారికి వీసా మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం టోర్నీలో పాల్గొనే పాక్ షూటర్ల వీసాల మంజూరుకు ఆమోదించిందని.. హైకమీషన్‌తో పాటు పాక్‌కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఇద్దరు పాకిస్థానీ రైఫిల్ షూటర్లతో పాటు ఒక కోచ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు భాటియా వివరించారు.

3463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles