నెంబర్-2 ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్

Wed,August 28, 2019 01:40 PM

దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్ ఆల్ రౌండర్ల జాబితాలో 411 పాయింట్లతో నెంబర్-2 పొజిషన్‌కు చేరుకున్నాడు. ఇంతకు ముందు అతను 4వ స్థానంలో ఉన్నాడు. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 433 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో స్టోక్స్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.


ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 135పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టాడు. నాలుగు వికెట్లు కూడా పడగొట్టిన స్టోక్స్ 44పాయింట్లు సాధించి కేరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. యాషెస్ సిరీస్ ముగిసే లోగా హోల్డర్ రికార్డు బద్దలు చేసే అవకాశం స్టోక్స్‌కు ఉంది. వారిద్దరి మధ్య చాలా తక్కువ పాయింట్ల వ్యత్యాసం ఉంది. అలాగే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌లో స్టోక్స్ బెస్టు ర్యాంకు ఇదే కావడం గమనర్హం. ఇంతకు ముందు అతని కేరీర్ బెస్ట్ 19వ ర్యాంక్.

1421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles