ఐపీఎల్‌-2018 అవార్డు విజేత‌లు వీరే

Mon,May 28, 2018 09:43 AM

Orange Cap, Purple Cap, Best Catch, Emerging Player, MVP Complete list of awards

ముంబయి: వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 తుది సమరం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఘనంగా ముగిసింది. ఫైనల్లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి ధోనీసేన టైటిల్ కైవసం చేసుకుంది. ఐతే టోర్నీలో 8 జట్లకు చెందిన ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో తమదైన శైలిలో మ్యాచ్‌లను మలుపుతిప్పారు. మెగా టోర్నీలో గొప్ప ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, తమ వ్యవహారశైలితో ఆకట్టుకున్న వారికి కూడా అవార్డులు, నగదు బహుమతులను అందజేశారు.

ఈ ఏడాది అవార్డులు వీరికే..

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(ఫైనల్): షేన్ వాట్సన్

ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు): కేన్ విలియమ్సన్(సన్‌రైజర్స్ హైదరాబాద్, 735 పరుగులు)

పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు): ఆండ్రూ టై(కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 24 వికెట్లు)

పర్‌ఫెక్ట్ క్యాచ్(విరాట్ కోహ్లీ) ఆఫ్ ది సీజన్: ట్రెంట్ బౌల్ట్(ఢిల్లీ డేర్‌డెవిల్స్)

ఎమర్జింగ్ ప్లేయర్ ది సీజన్: రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్,684 పరుగులు)

స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్)

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సునీల్ నరైన్(కోల్‌కతా నైట్‌రైడర్స్)

సూపర్ స్ట్రయికర్‌: సునీల్ నరైన్(కోల్‌కతా నైట్‌రైడర్స్)

ఇన్నోవేటివ్ థింకింగ్: చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ

ఫెయిర్ ప్లే అవార్డు: ముంబయి ఇండియన్స్

4096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles