ఐపీఎల్‌: బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్ ఎవరో తెలుసా?

Sun,May 27, 2018 03:06 PM

ముంబయి: భారత క్రీడారంగంలో విశ్లేషకులుగా రాణిస్తున్న మహిళా వ్యాఖ్యాతలు చాల తక్కువ. క్రికెట్ యాంకర్ కమ్ ప్రెజంటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న మయాంతీ లాంగర్ వారిలో అగ్రస్థానంలో ఉంటుంది. టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ద్వారా ఆమె క్రీడా ప్రపంచానికి ఎక్కువగా పరిచయం అయినప్పటికీ తన ప్రొఫెషనల్ వర్క్‌లో ప్రత్యేక ముద్ర వేసి ప్రశంసలు అందుకుంటోంది.

పురుషులతో సమానంగా పోటీపడి తనదైన శైలిలో విశ్లేషణలు, ప్రశ్నలు సంధిస్తూ ఎంతోమంది క్రికెటర్లను, వ్యాఖ్యాతలను , అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమెపై సుధీర్ఘ కామెంటరీ అనుభవం ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ మయాంతి అపార ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.

ఐపీఎల్‌లో ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పనిచేయడాన్ని ఆస్వాదించాను. బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్ మాత్రం మయాంతి లాంగర్. తన వృతిపట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆమె ఎంత బాగా పనిచేస్తున్నారో మాకు ఓ మంచి అవగాహన ఉంది. గ్రేట్ జాబ్ మయాంతి అని జోన్స్ ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు.


4812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles