సూప‌ర్ఓవ‌ర్‌కు దారితీసిన ఓవ‌ర్‌త్రోపై స‌మీక్ష‌

Tue,August 13, 2019 02:03 PM

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో వివాదాస్ప‌దంగా మారిన ఓవ‌ర్‌త్రో గురించి ఎంసీసీ వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌మిటీ స‌మీక్షించ‌నున్న‌ది. ఉత్కంఠగా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు త‌గిలిన ఓవ‌ర్‌త్రో బౌండ‌రీ వెళ్ల‌డం వ‌ల్ల కివీస్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ టై అయినా.. బౌండ‌రీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.


అయితే సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసిన ఓవ‌ర్‌త్రో గురించి వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌మిటీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో స‌మీక్షించ‌నున్న‌ది. డబ్ల్యూసీసీ ప్యాన‌ల్‌లో ఉన్న మాజీ క్రికెట‌ర్లు షేన్ వార్న్‌, కుమార సంగ‌క్క‌ర‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ఫైన‌ల్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన ధ‌ర్మ‌సేన కూడా తొంద‌ర‌పాటులో ఓవ‌ర్‌త్రోకు అధిక ప‌రుగులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఓవ‌ర్‌త్రోకు సంబంధించి 19.8 నియ‌మావ‌ళిని ప‌రిశీలించ‌నున్న‌ట్లు మేరిలీబోన్ క్రికెట్ క్ల‌బ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ప్లేయ‌ర్ల రిప్లేస్‌మెంట్ నిర్ణ‌యాన్ని ఎంసీసీ స్వాగ‌తించింది.

2532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles