లంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోంది: పాక్

Tue,September 10, 2019 06:17 PM

Pakistan Minister Blames India For Sri Lanka Players  Tour Boycott

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆదేశ క్రికెటర్లు గట్టిషాకిచ్చిన విషయం తెలిసిందే. పది మంది లంక క్రికెటర్లు భద్రతా కారణాలరీత్యా పాక్ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఐతే లంక ఆటగాళ్లు వెనుకడుగు వేయడానికి భారతే కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. పాక్ వేదికగా తర్వలో జరిగే సిరీస్‌లో లంక క్రికెటర్లు పాల్గొనకుండా వారిని భారత్ భయపెట్టిందని పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్విటర్ వేదికగా ఆరోపించారు.

'ఒకవేళ మీరు పాక్ పర్యటనను విరమించుకోకపోతే ఐపీఎల్ నుంచి తొలగిస్తామని లంక క్రికెటర్లను ఇండియా బెదిరించిందని కొంతమంది స్పోర్ట్స్ వ్యాఖ్యాతలు నాతో చెప్పారు. ఇది నిజంగా చీప్ టాక్టిక్. ఇలాంటి చర్యలను మనమంతా తప్పకుండా ఖండించాలి. భారతీయ క్రీడా అధికారులు చెత్త ఎత్తుగడలు వేశారని' మంత్రి ఆరోపించారు. శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్ మలింగ, మాజీ కెప్టెన్లు ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమాల్‌తో సహా పదిమంది క్రికెటర్లు పాక్ పర్యటనను వ్యతిరేకించారు. సెప్టెంబర్ 27 నుంచి లంక టీమ్ పాక్‌లో పర్యటిస్తుందని కొద్దిరోజుల క్రితం లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.

2306
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles