పాక్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకోండి.. ప్రధాని ఇమ్రాన్‌ను కోరిన కమ్రాన్ అక్మల్..

Thu,June 20, 2019 08:25 PM

pakisthan former cricket player kamran akmal urges pm imran to take action

గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. కాగా ఈ ఓటమిని పాక్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే పాక్ క్రికెట్ టీంపై అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. భారత్ చేతిలో పాక్ ఓటమిపై కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెంటనే తమ క్రికెట్ టీంపై చర్యలు తీసుకోవాలని అన్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పాక్ జట్టుపై చర్యలు తీసుకోవాలని, భారత్ చేతిలో ఓడిపోయినందుకు పాక్ టీంపై దృష్టి పెట్టి తగిన విధంగా స్పందించాలని, పాకిస్థాన్ క్రికెట్‌ను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు.

7214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles