పాకిస్థాన్‌కు షాక్.. వెంట వెంటనే కూలిన 4 వికెట్లు..

Sun,June 16, 2019 10:19 PM

లండన్: భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు షాక్ తగిలింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు వెంట వెంటనే 4 పాక్ వికెట్లను పడగొట్టారు. ఓ దశలో భారత్‌కు ప్రమాదకరంగా మారిన ఫకర్ జమాన్ (62 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్), బాబర్ ఆజం(48 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లను కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో పెవిలియన్ పంపగా, పాండ్యా.. మహమ్మద్ హఫీజ్ (9 పరుగులు, 1 సిక్సర్), షోయబ్ మాలిక్‌లను రెండు వరుస బంతుల్లో ఔట్ చేశాడు. మాలిక్ తాను ఆడిన తొలి బంతికే ఔట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పాక్ జట్టు 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నది.

3841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles