ధోనీనా మజాకా.. ! వీడియో

Mon,March 18, 2019 03:59 PM

Party Starts in Chennai as 12000 Turn Up for CSK Practice Game

చెన్నై: ఐపీఎల్ సంబరానికి సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో సమ్మర్ హీట్‌కి ఐపీఎల్ ఫీవర్ తోడుకానుంది. ఐపీఎల్‌-12 సీజ‌న్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు ఆట‌గాళ్ల‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ ఉన్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. కేవ‌లం ఆట‌గాళ్ల ప్రాక్టీస్‌ను చూసేందుకు సుమారు 12వేల మందికి పైగా ఫ్యాన్స్ మైదానానికి వ‌చ్చిన‌ట్లు చెన్నై ప్రాంఛైజీ పేర్కొంది. ఇక బ్యాట్ తీసుకొని మైదానంలోకి ధోనీ అడుగుపెట్ట‌గానే ధోనీ..ధోనీ అంటూ కేక‌లు పెట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సీఎస్‌కే ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ నెల 23న ఐపీఎల్-12 ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే.


2608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles