ఐపీఎల్‌-11 'ముగింపు' అదరాలి!

Sun,May 27, 2018 05:25 PM

Preparations on in full swing for the big day Final

ముంబయి: తారల నృత్యాలు.. సంగీత గాయకుల పాటలు.. అభిమానుల కేరింతల మధ్య ఐపీఎల్-11 ఏప్రిల్-7న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌తో టోర్నీకి అదిరే ఆరంభం లభించింది. దాదాపు ఎనిమిది వారాల పాటు సాగిన పోరులో 8 జట్లు పాల్గొన్నాయి. మండు వేసవిలో క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించింది ఐపీఎల్. 60 మ్యాచ్‌ల మహాసంగ్రామంలో ఆఖరి మ్యాచ్ కూడా మళ్లీ వాంఖడే మైదానం ఆతిథ్యమివ్వబోతోంది.

ఇప్పటి వరకు 149 మంది ఆటగాళ్లు ఎన్నో మైళ్లు ప్రయాణించి..10 వేదికల్లో మ్యాచ్‌లు ఆడారు. శుక్రవారంతో టోర్నీలో 59వ మ్యాచ్ ముగిసింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నైకి.. దుర్బేధ్యమైన బౌలింగ్ దళం కలిగిన హైదరాబాద్ మధ్య జరిగే ఆసక్తికర పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఐపీఎల్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


2965
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles