బెన్ స్టోక్స్@రూ.12.50 కోట్లు

Sat,January 27, 2018 10:45 AM

బెంగుళూరు: ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్నది. అతన్ని 12.50 కోట్లకు ఆ టీమ్ గెలుచుకున్నది. సౌతాఫ్రికా క్రికెటర్ డూప్లిసెస్‌ను చెన్నై టీమ్ సొంతం చేసుకున్నది. రూ.1.60 కోట్లకు అతను అమ్ముడుపోయాడు. అజింక్య రహానెను రూ.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ గెలుచుకున్నది. విండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్‌ను వేలంలో ఎవరూ కొనలేదు. అతనికి మళ్లీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.ఐపీఎల్ 2018 కోసం క్రికెటర్ల వేలం జరుగుతున్నది. కాసేపటి క్రితం వేలం ప్రక్రియ మొదలైంది. ఢిల్లీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నది. ధావన్‌ను ఆ జట్టు రూ.5.20 కోట్లకు వేలంలో గెలుచుకున్నది. స్పిన్న‌ర్ అశ్విన్‌ను కింగ్స్ లెవ‌న్ పంజాబ్ సొంతం చేసుక‌న్న‌ది. అశ్విన్‌ను రూ.7.60 కోట్ల‌కు కింగ్స్ జ‌ట్టు ఎగురేసుకుపోయింది.

మ్యాక్స్‌వెల్@రూ.9 కోట్లు
ఐపీఎల్ ఆటగాళ్ల కోసం వేలం జరగుతున్నది. రెండవ రౌండ్ వేలంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు భారీ నజరానా దక్కింది. మ్యాక్స్‌వెల్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు సొంతం చేసుకున్నది. ఆసీస్ క్రికెటర్‌ను ఆ టీమ్ రూ.9 కోట్లకు కైవసం చేసుకున్నది. డ్వేయిన్ బ్రావో మళ్లీ చెన్నై జట్టుకే వెళ్లాడు. రూ.6.40 కోట్లకు బ్రావోను చెన్నై సొంతం చేసుకున్నది. బేస్ ప్రైస్‌కే హర్భజన్‌ను చెన్నై టీమ్ గెలుచుకున్నది. గౌతమ్ గంభీర్‌ను రూ.2.80 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకున్నది. విలియమ్‌సన్‌ను రూ.3 కోట్లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ గెలుచుకున్నది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. పంజాబీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం బేస్‌ప్రైస్ రూ. 2 కోట్లకే అమ్ముడుపోవడం శోచనీయం.

రాహుల్ జాక్‌పాట్
కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో ఊహించని ధరకు అతను అమ్ముడుపోయాడు. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం చేసుకున్నది. ఇవాళ మూడవ రౌండ్ వేలంలో రాహుల్ అమ్ముడుపోయాడు. ఇప్పటివరకు ఇవాళ్టి వేలంలో బెన్ స్టోక్స్ తర్వాత రాహుల్‌కు అత్యధిక ప్రైస్ దక్కింది. కరణ్ నాయర్‌ను కూడా కింగ్స్ లెవన్ జట్టు రూ.5.60 కోట్లకు సొంతం చేసుకున్నది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. మ‌నీష్ పాండే కూడా జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకున్న‌ది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ గెలుచుకున్న‌ది.

2648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles