రషీద్ ఖాన్ హెలికాప్టర్ షాట్.. వీడియో చూడండి

Sat,May 26, 2018 06:54 PM

Rashid Khan Hits MS Dhoni-Esque Helicopter Shot In SRH vs KKR IPL Match

కోల్‌కతా: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ సంచలన ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్(34 నాటౌట్: 10 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) ఆకాశమేహద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. బ్యాట్‌తో అదరగొట్టిన రషీద్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్థాయిలో అన్నివైపులా చాలా భిన్నషాట్లు ఆడి ఆకట్టుకున్నాడు. చప్పగా సాగుతున్న సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఆఖర్లో విధ్వంసం సృష్టించి మంచి ముగింపునిచ్చాడు.

ఇందులో అచ్చం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాదిరిగా హెలికాప్టర్ షాట్ ఆడి.. స్వేర్‌లెగ్‌లో బంతిని భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుతం ఆ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రషీద్ ఆడిన షాట్ ఇన్నింగ్స్‌లోనే హైలెట్‌గా నిలిచిందని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నారు.


8143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles