రషీద్‌ఖాన్ తుఫాన్‌కు ఎంతమంది స్పందించారో చూడండి

Sat,May 26, 2018 03:44 PM

Rashid Khan Is Best T20 Spinner In The World Says Sachin Tendulkar

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరును చూసిన అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అసాధారణ ప్రదర్శన సీజన్‌లోనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్(34 నాటౌట్: 10 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు)లో.. బౌలింగ్(3/19)లో.. ఫీల్డింగ్(రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్)లో అన్నీ తానే ఒంటిచేత్తో హైదరాబాద్ ఫైనల్ చేరడంలో ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. అతడి పోరాటంతోనే హైదరాబాద్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో అతని ఆల్‌రౌండ్ షోకు ఫిదా అయిన అంతర్జాతీయ సమాజం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేవలం క్రికెట్ ఆట..క్రీడలకు సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాదు.. సినీ, రాజకీయ, పాత్రికేయ, తదితర రంగాల ప్రముఖులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. రషీద్ హీరో అని.. ఆతని ఆటతీరు పట్ల దేశం మొత్తం గర్వంగా ఫీలవుతున్నట్లు సాక్షాత్తు అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్విటర్‌లో పేర్కొనడం విశేషం. తెలుగు సినిమా రంగానికి చెందిన వారు కూడా విషెస్ చెప్పడం విశేషం.


8911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles