రవిశాస్త్రి ఫోటోపై ట్రోల్స్..

Tue,August 27, 2019 01:08 PM

ఆంటిగ్వా: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మొదటి టెస్టులో విండీస్‌పై నాలుగు రోజుల్లోనే గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా విరామ సమయంలో కొకొబే బీచ్‌లో జాలీగా గడుపుతోంది. కోచ్ రవిశాస్త్రి ఈ సందర్భంగా ఓ ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. హాట్ హాట్ వాతావరణంలో హాయిగా జ్యూస్‌తో ఇలా.. కోకోబే లోని షీర్ రాక్ రెస్టారెంట్ చాలా అందంగా ఉంది. అని క్యాప్షన్ ఇచ్చాడు.


అయితే ఈ ఫోటోపై అతడంటే గిట్టని కొందరు నెటిజన్స్ విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. అతడు జాలీగా చేతులు చాచి ఫోటోకు ఫోజులివ్వగా, నెటిజన్స్ మాత్రం ఆయన చేతుల్లో మద్యం బాటిల్స్ ఉంచి ఫోటోను మార్ఫింగ్ చేసి, పలు రకాలుగా స్పందిస్తున్నారు. మద్యంతో ఎంజాయ్ చేస్తున్నాడని కొందరు, అందుకే హాయిగా ఉన్నట్టుందని మరికొందరు కామెంట్లు రాస్తున్నారు. కాగా, రవిశాస్త్రి వచ్చే టీ20 వరల్డ్‌కప్ వరకు హెడ్‌కోచ్‌గా నియమితులవడం తెలిసిందే.







1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles