15 రన్స్ చేస్తే రోహిత్ కొత్త రికార్డు

Wed,December 20, 2017 03:08 PM

Rohit Sharma 15 runs short to 1500 runs in T20s

కటక్‌ః వన్డేల్లో 3 డబుల్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన టీమిండియా స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకతో జరగబోయే తొలి టీ20లో మరో రికార్డు ముందు ఉన్నాడు. మరో 15 రన్స్ చేస్తే టీ20ల్లో 1500 రన్స్ చేసిన రెండో ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా అతను నిలుస్తాడు. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో 1500 మైల్ స్టోన్‌ను దాటాడు. కోహ్లి 55 మ్యాచుల్లో 1956 రన్స్ చేశాడు. అందులో 18 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. రోహిత్ శర్మ 68 మ్యాచుల్లో 1485 రన్స్ చేయగా.. అందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడాదిగా అసలు వాడని కటక్‌లోని బారాబతి స్టేడియం పిచ్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన కనిపిస్తున్నది. మాజీ కెప్టెన్ ధోనీ స్టేడియంలో అడుగుపెట్టగానే నేరుగా వెళ్లి పిచ్‌ను పరిశీలించాడు. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రోహిత్ కూడా పిచ్ దగ్గరికి వెళ్లి చూశారు. ఇక్కడ 2015లో సౌతాఫ్రికాతో ఏకైక టీ20 జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. అయితే ఏడాది కిందట ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో మొత్తం 700కుపైగా రన్స్ నమోదవడం విశేషం. ఆ మ్యాచ్‌లో ధోనీ, యువరాజ్ సెంచరీలు చేశారు.

4088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles