యువీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

Thu,March 15, 2018 10:31 AM

Rohit Sharma breaks Yuvraj Singhs record of most sixes by an Indian in T20Is


కొలంబో: గత కొన్ని మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రోహిత్ శర్మ ఎట్టకేలకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. టీ20 ట్రైసిరీస్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాతో జరిగిన టీ20లో రోహిత్ చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ 61 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజృంభించిన రోహిత్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (74) బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. బుధవారం టీ20లో 5 సిక్సులు కొట్టడంతో రోహిత్ ఖాతాలో సిక్సర్ల సంఖ్య 75 చేరింది. టీమిండియా తరఫున సురేశ్ రైనా(54), మహేంద్రసింగ్ ధోనీ(46), విరాట్ కోహ్లీ(41) అత్యధిక సిక్సులు బాదిన వారిలో తరువాతి స్థానాల్లో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

3132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles