ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్‌శర్మ

Tue,January 29, 2019 11:31 AM

ముంబై: కళ్లు చెదిరే ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ధోనీ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 62 పరుగులతో టీమ్ తరఫున హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్.. రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే అతడు మహి సరసన నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భార‌త‌ ప్లేయర్‌గా ఎమ్మెస్ ధోనీ తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వన్డేల్లో 337 వన్డేల్లో 222 సిక్స్‌లు కొట్టాడు. అందులో 7 సిక్సర్లు ఏషియా ఎలెవన్ టీమ్ తరఫున కొట్టినవి కాగా.. మిగతా 215 టీమిండియాకు ఆడుతున్న సమయంలో బాదాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా వన్డేల్లో 215 సిక్స్‌లు కొట్టడం విశేషం.


న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ బౌండరీ మీదుగా సిక్స్ కొట్టిన రోహిత్.. ధోనీని సమం చేశాడు. రోహిత్, ధోనీ తర్వాత 195 సిక్స్‌లతో సచిన్ టెండూల్కర్ మూడోస్థానంలో ఉన్నాడు. గంగూలీ (189), యువరాజ్‌సింగ్ (153) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో లిస్ట్ ఎ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలురాయి అందుకున్న పదో భారత బ్యాట్స్‌మన్‌గానూ రోహిత్ నిలిచాడు. రోహిత్ 260 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. కోహ్లి (219), గంగూలీ (252), సచిన్ (257) తర్వాత అత్యంత వేగంగా పది వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలవడం విశేషం.

4355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles