రోహిత్ శ‌ర్మ ఔట్‌

Thu,October 10, 2019 10:21 AM

హైద‌రాబాద్‌: ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో రోహిత్ శ‌ర్మ ఔటయ్యాడు. వైజాగ్‌లో జ‌రిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచ‌రీల‌తో అల‌రించిన రోహిత్‌.. పుణె టెస్టులో మాత్రం త్వ‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. రోహిత్ కేవ‌లం 14 ప‌రుగులు చేసి ర‌బ‌డ బౌలింగ్‌లో క్యాచ్ ఔట‌య్యాడు. భార‌త్ ప‌ది ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 25 ర‌న్స్ చేసింది. మ‌రో ఓపెన‌ర్ మ‌యాంక్ నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వ‌న్‌డౌన్‌లో పుజారా క్రీజ్‌లోకి వ‌చ్చాడు. అంత‌క‌ముందు టాస్ గెలిచిన భార‌త్‌.. మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. హ‌నుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాద‌వ్‌ను తీసుకున్నారు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 50వ టెస్టు కావ‌డం విశేషం.

1621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles