రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడించాలి: గంగూలీ

Thu,September 5, 2019 06:24 PM

న్యూఢిల్లీ: భారత్ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడించాలని సూచించాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇండియా 2-0తో వైట్ వాష్ చేసినప్పటికీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ విషయంలో పునరాలోచించాలన్నాడు. మయాంక్ అగర్వాల్ పర్వాలేదనిపిస్తున్నాడు. అతనికి ఇంకా అవకాశాలివ్వాలి. కానీ, ఎన్ని అవకాశాలిచ్చినా లోకేశ్ రాహుల్ సద్వినియోగం చేసుకోవడంలేదనీ, అతని స్థానంలో ఓపెనర్‌గా రోహిత్‌ను పంపించాలన్నాడు.


వరల్డ్‌కప్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. రికార్డు స్థాయిలో 5 సెంచరీలు చేసినప్పటికీ అతడికి టెస్టు జట్టులో స్ధానం లభించడం లేదన్నాడు. మిడిలార్డర్‌లో రహానే, హనుమ విహారీలు అద్భుతంగా ఆడుతున్నందున అతడికి అక్కడ స్థానం లభించడం కష్టమే. కాబట్టి రాబోయే టెస్టు సిరీసుల్లో మయాంక్‌కు తోడుగా రోహిత్‌ను పంపిస్తే ఫలితముంటుందన్నాడు.

కాగా, రోహిత్ శర్మ ఇప్పటికే వన్డే, టీ-20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు ఫార్మాట్స్‌లో రోహిత్ వైస్ కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు.

1514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles