పోక్రాన్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..

Tue,February 19, 2019 09:06 AM

Sachin Tendulkar attends Vayu Shakti Air Force show in Pokhran

పోక్రాన్: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌.. టాప్ గ‌న్ అవ‌తారమెత్తాడు. పోక్రాన్‌లో జ‌రుగుతున్న వాయుశ‌క్తి విన్యాసాల‌కు హాజ‌ర‌య్యాడు. ఆర్మీకి చెందిన గ్రీన్ సూట్‌ను ధ‌రించిన స‌చిన్‌.. వాయు విన్యాసాల‌ను ఆస‌క్తిగా తిల‌కించాడు. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బీఎస్ ధ‌నోవా మ‌ధ్య స‌చిన్ కూర్చుని వాయుశ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌లను త‌న మొబైల్‌తో షూట్ చేశాడు. వాయుశ‌క్తి ఈవెంట్‌పై త‌న అభిప్రాయాల‌ను స‌చిన్ ట్వీట్ చేశాడు. వాయుశ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని, శ‌త్రువుల నుంచి ర‌క్షిస్తూ దేశం కోసం ప్రాణాల‌ర్పించే వారితో గ‌డ‌ప‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌న్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రెండేళ్ల త‌ర్వాత‌.. భార‌త వైమానిక ద‌ళం గ్రూప్ కెప్టెన్ బిరుదుతో స‌చిన్‌ను స‌న్మానించిన విష‌యం తెలిసిందే..2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles