క్రికెట్‌కు సారా టేలర్ గుడ్‌బై

Fri,September 27, 2019 06:44 PM

లండన్: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికింది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా జట్టులో కీలక ప్లేయర్‌గా రాణించిన ఆమె 2006లో అరంగేట్రం చేసింది. జాతీయ జట్టు తరఫున 226 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన సారా 6,533 పరుగులు సాధించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకరిగా ఆమె నిలువడం విశేషం. వికెట్ కీపర్‌గా మూడు ఫార్మాట్లలో 232 మందిని ఔట్ చేసింది. 126 వన్డేల్లో 7 సెంచరీలు, 20 అర్ధశతకాలు నమోదు చేసింది. 90 టీ20 మ్యాచ్‌లాడి 2,177 రన్స్ చేసింది. టెస్టు క్రికెట్లో కేవలం 10 మ్యాచ్‌లాడిన సారా 330 పరుగులు సాధించింది.

ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ.. 'ఇది చాలా కఠిన నిర్ణయం. కానీ నాతో పాటు నా ఆరోగ్యానికి సంబంధించి ఇది సరైన నిర్ణయమే. ఇంగ్లాండ్ తరఫున ఆడటం, చాలా ఏళ్ల పాటు జెర్సీ ధరించడంతో నా కల నెరవేరింది. నా కెరీర్‌లో ఎన్నో మధురానుభూతులు సొంతం చేసుకున్నా. 2006లో అరంగేట్రం చేసినప్పటి నుంచి యాషెస్ సిరీస్ విజయం, లార్డ్స్‌లో వరల్డ్ కప్ ఫైనల్ ఇలా చెప్పుకోదగ్గ గొప్ప విషయాలున్నాయి. సుధీర్ఘ కెరీర్‌లో ప్రపంచం నలుమూలలా పర్యటించాను. ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను పరిచయం చేసుకున్నాను.' అని సారా పేర్కొంది.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles