త‌గ్గిన ప‌ర్ఫార్మెన్స్‌.. పాక్ కెప్టెన్‌పై వేటు

Fri,October 18, 2019 04:06 PM

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌పై వేటు ప‌డింది. టెస్టుల‌తో పాటు టీ20 సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి స‌ర్ఫరాజ్‌ను త‌ప్పించారు. అయితే టెస్టు మ్యాచ్‌ల‌కు పాక్ కొత్త కెప్టెన్‌గా అజ‌హ‌ర్ అలీని ప్ర‌క‌టించారు. 2019-20 టెస్టు చాంపియ‌న్‌షిప్‌కు అత‌నే కెప్టెన్‌గా వ్య‌వ‌హరిస్తాడు. టీ20ల‌కు మాత్రం బాబ‌ర్ ఆజ‌మ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. 2020లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఆజ‌మ్ కొన‌సాగుతాడు. స‌ర్ఫరాజ్ ప‌ర్ఫార్మెన్స్ ఓవ‌రాల్‌గా త‌గ్గ‌డంతో అత‌న్ని కెప్టెన్సీ నుంచి తొల‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఇటీవ‌ల శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో.. పాకిస్థాన్ దారుణంగా ఓట‌మిపాలైంది. ఆ సిరీస్‌లో వైట్‌వాష్ కావ‌డంతో పాక్ కెప్టెన్‌పై తీవ్ర వ‌త్తిడి వ‌చ్చింది. స‌ర్ఫ‌రాజ్‌ను తొల‌గించే నిర్ణ‌యం ఇబ్బందిక‌ర‌మైన‌దే అయినా.. త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఇలా చేయాల్సి వ‌చ్చింద‌న పీసీబీ చైర్మ‌న్ ఎహ‌సాన్ మ‌ణి తెలిపారు.

1229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles